రెండో రోజు సిఐటియు జిల్లా నిర్మాణ వర్క్ షాపులో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్

By Citu Kadapa from India

ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే తిప్పికొట్టాలని సిఐటియు జిల్లా నిర్మాణ వర్క్ షాపు లో నాయకులు ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్ మాట్లాడుతూ జిల్లాలో కార్మికులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కడప ఇండస్ట్రియల్ కొప్పర్తి ఇండస్ట్రీలో కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయలేదని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సమానమైన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి కార్మికులకు వ్యతిరేకంగా ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటు వాళ్లకి ఇచ్చి ధారా దత్తం చేయడం దుర్మార్గం అన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేయడం దుర్మార్గం అన్నారు. కాబట్టి పోరాటం తప్ప మార్గం లేదని కార్మికులకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్న మాట వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా కార్మికులకు సరైనటువంటి సౌకర్యాలు లేకపోయినా లేబర్ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని తెలిపారు. ప్రైవేట్ స్కూల్లో ప్రవేట్ హాస్పిటల్ లో కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ధ్వజమెత్తారు. స్కీం వర్కర్లు అంగన్వాడి ,ఆశా,మధ్యాహ్నం భోజనం, మున్సిపల్ ,కార్మికులు విద్యుత్ కార్మికులు ,ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేసే అన్ని రకాల కార్మికులు, అసంఘటితరoగ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో కార్మికుల సమస్యల మీద పనిచేసే వాళ్ళకి ఓటేయాలని పిలుపునిచ్చారు. ఈ వర్క్ షాప్ కు బి లక్ష్మీదేవి అధ్యక్షత వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, వెంకటసుబ్బయ్య భైరవ ప్రసాద్, చంద్రశేఖరు, ఆర్ లక్ష్మీదేవి, జిల్లా కమిటీ సభ్యులు అంజలీదేవి, విజయ్ కుమార్, లక్ష్మీదేవి, నాగలక్ష్మి, పుల్లయ్య, సుదర్శను ,చంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, విజయలక్ష్మి, వెంకటపతి, సుబ్బరాయుడు రంగాల ప్రాంతాల నాయకులు పాల్గొన్నారు.

Loading