By Citu Kadapa from India ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే తిప్పికొట్టాలని సిఐటియు జిల్లా నిర్మాణ వర్క్ షాపు లో నాయకులు ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్ మాట్లాడుతూ జిల్లాలో కార్మికులు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కడప ఇండస్ట్రియల్ కొప్పర్తి ఇండస్ట్రీలో కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయలేదని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం సమానమైన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి కార్మికులకు వ్యతిరేకంగా ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటు వాళ్లకి ఇచ్చి ధారా దత్తం చేయడం దుర్మార్గం అన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేయడం…